సాధారణంగా టూత్ పిక్ లను చాలామంది హోటల్ లకు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు వాడతారు. ఆహారం తిన్న తర్వాత దాని సహాయంతో మీ పండ్లలో చిక్కుకున్నటువంటి ముక్కలను తొలగిస్తారు. దీని ద్వారా నోటిలో వచ్చే సమస్యలను నివారించవచ్చు. ఒకవేళ ఆహారాన్ని తొలగించకపోతే మనకు సమస్యలు ఏర్పడతాయి. మనం టూత్ పిక్ ని పట్టుకున్నప్పుడు దాని ముందుభాగం షార్ప్ గా వెనుక భాగం ఒక డిజైన్ తో ఎత్తుగా ఉండటం మనం గమనిస్తాం.
మరి అలా ఎత్తుగా ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దానికి ప్రధానమైన కారణం ఉంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ముక్కలు మన పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి నప్పుడు నీళ్ల తో గాని, గుడ్డతో గాని శుభ్రం చేసినా కొన్ని చిన్న ముక్కలు అతుక్కుపోయి ఉంటాయి. ఈ టూత్ పిక్ ద్వారా వాటిని సులభంగా తొలగించవచ్చు. దాని ముందు వైపున షార్పుగా వెనుకవైపున గుండ్రంగా చివరిలో స్క్రూ లాంటి డిజైన్ ఉంటుంది. కానీ ఇది డిజైన్ కాదు ఇది మనం టేబుల్ మీద ఉంచినప్పుడు ఒకరకంగా మనకు కనిపిస్తుంది.
టూత్ పిక్ లను ఎక్కువగా కర్రతో తయారు చేస్తారు. ముందుభాగం షార్పుగా, వెనుకభాగం గుండ్రంగా తయారు చేయడం వల్ల మనం టేబుల్ పై ఉంచినా కానీ ముందుభాగం టేబుల్ కు తాగకుండా శుభ్రంగా ఉంటుంది. అలాగే వెనుక భాగంలో రంగు ఆకారం ఉండటంవల్ల టూత్ పిక్ వాడిన తర్వాత టేబుల్ పై ఉంటే ముందు ఆ రింగు వద్ద కాస్త విరిచి వేస్తే అది ఇప్పటికే ఉపయోగించారని అర్థం చేసుకోవచ్చు. దాని కోసమే ఆ రింగులు ఇస్తారు. అలా ఉండటం వల్ల మనం ఉపయోగించిన టేబుల్ పై ఉన్న టూత్ పిక్ మరొకరు ఉపయోగించకుండా ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి.