Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

హాస్ట‌ళ్ల‌లో ఉంటున్న అమ్మాయిలు.. క‌చ్చితంగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవి..!

Admin by Admin
May 15, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు తయారయ్యాయి ప్రస్తుత రోజులు. స్నేహం ముసుగులో మెత్తగా ముంచేస్తున్నారు. స్నేహితులమే కదా అని తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇటువంటి సంఘటనల్లో కంగారు పడకుండా.. ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు భరోసా ఇస్తున్నారు. హాస్టల్‌ లో చేరిన ప్రతి అమ్మాయి చుట్టు పక్కల పరిసరాలను గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా స్నేహం పేరిట అన్ని విషయాలను ఎటువంటి దాపరికాలు లేకుండా పంచుకోవటం అనేది ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఎంత స్నేహితురాళ్లు అయినప్పటికీ పరిధులు దాటకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారితో హాస్టల్‌లో పరిచయం ఏర్పడినంత మాత్రాన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు. వ్యక్తిగత ఫోటోలు, ఫోన్‌ పాస్‌ వర్డ్‌లు వంటివి అస్సలు చెప్పకూడదు. అంతా అమ్మాయిలే, అందరూ తెలిసినవాళ్లే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు.

స్నానం చేసేటప్పుడు, దుస్తులు మార్చుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దుస్తులు మార్చుకునేటప్పుడు సరదాగా ఫోటో తీస్తున్నామన్నా అస్సలు ఉపేక్షించకండి. అటువంటి ఫోటోలు పొరపాటున మరొకరి కంట పడితే, తరువాత పరిణామాలు ఊహించుకోలేము. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం ఎంతో ఉత్తమం. అలా అని ఎవరితో సన్నిహితంగా ఉండకుండా, మూతి ముడుచుకొని ఉండమని కాదు.. స్నేహంలోనూ పరిధిలు విధించుకోవాలి.

women who are in hostel must follow these tips

ఇటీవల కాలంలో ఓ యువతికి సంబంధించిన ఫోటోలు అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి.. ఇంటర్‌నెట్‌లో పెట్టేశారు. ఫోటోల గురించి బాధిత యువతికి బంధువులు ఫోన్‌ చేసి చెప్పటంతో పోలీసులను ఆశ్రయించింది. తన ఫోటోలను తనతో పాటే హాస్టల్లో ఉంటున్న మరొక యువతి మార్ఫింగ్‌ చేయించి, ఇంటర్‌ నెట్‌లో పోస్ట్‌ చేయించిందని తెలియటంతో నిర్ఘారింతపోయింది. తనకంటే అందంగా ఉండటం, అందరితో కలివిడిగా ఉంటుందన్న అక్కసుతో బాధిత యువతి ఫోటోలను మార్ఫింగ్‌ చేయించినట్లు సదరు యువతి ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని జైలుకు తరలించారు.

ఫోటోలు మార్ఫింగ్‌, వీడియోలు లీక్‌ అవ్వటం వంటి ఘటనల్లో బాధిత యువతి తప్పు లేకపోయినా భయపడిపోతారు. కుటుంబ పరువు పోయిందనే భావనతో ఆత్మహత్య వంటి ఘటనలకు పూనుకుంటారు. ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని తెలంగాణ షీ టీమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. బాధితుల పేర్లు, వివరాలు బయటకు రాకుండా సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇటువంటి ఘటనల్లో ఆడవారే నిందితులైనా, శిక్షలు కఠినంగా ఉంటాయని షీ టీమ్‌ పోలీసులు హెచ్చరించారు.

Tags: women in hostel
Previous Post

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు ఆఫీసుల‌కు వెళ్తుంటే.. ఇలా చేయండి..

Next Post

మీరు వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ కవర్‌ కలర్‌ మారిందా.. ఎందుకో తెలుసుకోండి!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.