మనిషై పుట్టాక ఎవరైనా ఏదో ఒక జాబ్ చేయాల్సిందే కదా. కొందరు వ్యాపారం పెట్టుకుంటే కొందరు ఉద్యోగం చేస్తారు. ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ఏదో ఒక పనిచేస్తారు. కొందరు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటారు. ఇంకొందరు చట్ట వ్యతిరేక పనులు చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఎవరైనా ఏ తరహా ఉద్యోగం చేస్తారో వారి పుట్టిన నెలను బట్టి చెప్పవచ్చట. అంటే… వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాదు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అనేక మంది పుట్టిన నెలలు వారు చేస్తున్న ఉద్యోగాలను పరిశీలించాక ఏ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఎలాంటి ఉద్యోగాలు చేస్తారో చెప్పారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..!
1. జనవరి… ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తారట. ముఖ్యంగా బిల్ కలెక్టర్ వంటి క్యాడర్‌లో ఉండే జాబ్‌లు చేస్తారట. 2. ఫిబ్రవరి… ఈ నెలలో పుట్టిన వారు ఆర్టిస్టులుగా పనిచేస్తారట. మంచి కళారాధకులుగా ఉండడమే కాదు, అదే తమ వృత్తిగా ఎంచుకుని అందులో ముందుకు దూసుకెళ్తారట. 3. మార్చి… ఈ నెలలో పుట్టిన వారు ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తారట. విమానం లేదా హెలికాప్టర్ పైలట్లుగా ఉద్యోగాలు చేస్తారట. 4. ఏప్రిల్… ఈ నెలలో పుట్టిన వారు అనువాదకులుగా ఉంటారట. తమ మాతృభాష సాహిత్యంపై వీరికి పట్టు ఉంటుందట. రచనలు చేస్తారట. రచయితలుగా స్థిర పడతారట.
5. మే… ఈ నెలలో పుట్టిన వారు ఇంజినీరింగ్, మెడిసిన్, డిప్లొమా వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తారట. వాటిల్లో సెటిల్ అవుతారట. 6. జూన్… ఈ నెలలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. వీరు కంపెనీలకు సీఈవోలుగా పనిచేస్తారట. లేదంటే ఎండీలుగా కూడా ఉంటారట. 7. జూలై… ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా సివిల్ ఇంజినీర్లు లేదంటే కాంట్రాక్టర్లుగా పనిచేస్తారట. ఇక చదువుకోకుండా ఉంటే నిర్మాణ కూలీలుగా పనిచేస్తారట. 8. ఆగస్టు… ఈ నెలలో పుట్టిన వారికి అంత ఈజీగా జాబ్ దొరకదట. ఎల్లప్పుడూ సమస్యలతో సతమవుతూ ఉంటారట. జాబ్ దొరకడం కష్టతరమవుతుందట.
9. సెప్టెంబర్… ఈ నెలలో పుట్టిన వారికి ఎలాంటి జాబ్ అయినా సులభంగా దొరుకుతుందట. ఏ జాబ్ అయినా చేయగలిగే సత్తా ఉంటుందట. 10. అక్టోబర్… ఈ నెలలో పుట్టిన వారు రాజకీయాల్లో రాణిస్తారట. రాజకీయ నాయకులుగా కెరీర్‌లో సెటిల్ అవుతారట. 11. నవంబర్… ఈ నెలలో పుట్టిన వారు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడతారట. ముఖ్యంగా హత్యలు చేసే కిల్లర్లుగా మారుతారట. 12. డిసెంబర్… ఈ నెలలో పుట్టిన వారు వైద్యులుగా సెటిల్ అవుతారట. ముఖ్యంగా వీరికి డెంటిస్టు అయ్యేందుకు చాన్సెస్ పుష్కలంగా ఉంటాయట.