చేతి వేళ్ల గోర్లపై సహజంగానే కొందరికి తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. కొందరికి ఇవి ఎక్కువగా ఉంటాయి. కొందరికి వెడల్పుగా ఉంటాయి. కొందరికి ఈ మచ్చలు చిన్నగానే ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అయిదే వైద్య పరిభాషలో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత సహజసిద్ధమైంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా చేతి వేళ్ల గోర్లపై అలా తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. మరి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చేతి వేళ్ల గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. నెయిల్ పెయింట్లను ఎక్కువగా వాడేవారికి అలా మచ్చలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
2. గోర్లకు దెబ్బలు తగిలినా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చినా అలా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడుతాయి.
3. నెయిల్ పాలిష్‌లు కొందరికి పడవు, అలర్జీని కలిగిస్తాయి. అలాంటి వారి గోర్లపై కూడా అలా మచ్చలు ఏర్పడుతుంటాయి.
4. జింక్ లేదా కాల్షియం లోపం ఉన్నా ఆ మచ్చలు వస్తుంటాయి. జింక్, కాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఆ మచ్చలు పోతాయి.
5. గుండె జబ్బులు ఉన్నవారికి, నోటి దుర్వాసన, కిడ్నీ ఫెయిల్యూర్, సోరియాసిస్, ఎగ్జిమా, న్యుమోనియా వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా అలా మచ్చలు వస్తాయి.
6. ఆర్సెనిక్ పాయిజనింగ్ అయినా అలా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడుతాయి.
అయితే మచ్చలు మరీ పెద్దగా ఉన్నా, ఎక్కువ సంఖ్యలో ఏర్పడినా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులను వాడాలి. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.