Onion In Underarms : చాలా సినిమాల్లో, కథల్లో.. చంకలో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల జ్వరం రావడం అనే విషయాన్ని గమనించే ఉంటారు. అసలు ఎందుకిలా జరుగుతుందని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది. అసలు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజమెంత..? దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
ఉల్లిపాయను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచడం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే పైపొర ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది. దాని కారణంగా శరీరం ఒక్కసారిగా వేడెక్కుతుంది. శరీర సగటు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు బాడీ గురౌతుంది. దీనినే మనం జ్వరం అంటాం. దీనికి అసలు కారణం ఏమిటంటే ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సీడ్, ఐసోలైన్, ఎలిసిన్ లు శరీరాన్ని వేడెక్కించి చికాకును కలిగిస్తాయి. దీని ద్వారా శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. అంతేగాక ఉల్లిపాయ శరీరంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్ని, వైరస్‌లను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కారణంగా శరీరానికి రక్షణగా నిలిచే సూక్ష్మజీవులు లేని కారణంగా జ్వరం వస్తుంది.
ఇలా వచ్చిన జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఇది అనారోగ్యానికి సూచికం కాదు. హార్మోన్లను మ్యానేజ్ చేసి జ్వరం తెప్పించుకోవడం లాంటిదే. కానీ బీపీ, షుగర్ లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారి విషయంలో ఈ ట్రిక్ చాలా డేంజర్. శరీర ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చు తగ్గులు వస్తే అది వారి ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తుంది. కనుక ఇలాంటి ట్రిక్స్ పాటించే వారు ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.