మానవ శరీరంలో ముక్కు-పెదవుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారో తెలుసా.. చాలా మందికి దీనిని ఏమంటారో తెలియదు. ఈ కథనంలో దీనికి సమాధానం తెలుసుకుందాం. తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అనే సామెత తెలుగులో ఉంది.. ఇది వంత శాతం నిజం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటీ మనకి తెలియవు. అంతెందుకు మన శరీరంలోనే అన్ని విషయాల గురించి మనకి తెలియదు. ఎన్నో వింతలు, అద్భుతాలు దాగి ఉన్న ఈ భూమి అందుకు ఉదాహరణ. భూమి చదునైనదా, గోళాకారమా అని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పటికీ.. ప్రపంచంలో ఇంకా కనుగొనబడని విషయాలు చాలా ఉన్నాయి.
ఎన్నో వింతలు, అద్భుతాలు దాగి ఉన్న ఈ భూమి అందుకు ఉదాహరణ. భూమి చదునైనదా, గోళాకారమా అని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పటికీ.. ప్రపంచంలో ఇంకా కనుగొనబడని విషయాలు చాలా ఉన్నాయి. నిత్యం జరుగుతున్న పరిశోధనల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. భూమి మాత్రమే కాదు.. మానవ శరీరం గురించి కూడా చాలా మందికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. మన శరీరంలోని ముఖంలోని ఒక భాగం పేరు ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
మనిషి ముఖంలో కళ్లు, చెవులు, ముక్కు, నోరు, పెదవులు, బుగ్గలు, నుదుటి అన్నీ కనిపిస్తాయి. అయితే ముక్కు, పెదవుల మధ్య ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తారో తెలుసా.. ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియదు. ఆ భాగాన్ని ఫిల్డ్రమ్ అని కూడా అంటారు. ఇది ముక్కు మరియు పెదవుల మధ్య ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది ఒక ఆంగ్ల పదం.