Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Pulao : ఆలుగ‌డ్డ‌ల‌తో చేసే ఈ పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు..!

D by D
June 6, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Pulao : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంప‌ల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ పులావ్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పడ‌ప్పుడూ ఇలా పులావ్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో రుచిగా, సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, అనాస పువ్వు – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ట‌మాట ముక్క‌లు – అర క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, పుదీనా – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, బాస్మ‌తీ బియ్యం – 300 గ్రా. లేదా ఒక గ్లాస్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Aloo Pulao recipe very tasty how to make it
Aloo Pulao

ఆలూ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేసి నిలువుగా ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత టమాట ముక్క‌లు, క‌ట్ చేసుకున్న బంగగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత పుదీనా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత క‌డిగిన బియ్యం వేసి క‌ల‌పాలి.

దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి కుక్క‌ర్ మూత పెట్టాలి. త‌రువాత ఒక విజిల్ వ‌చ్చే పెద్ద‌మంట‌పై ఉడికించాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఆవిరి అంతా పోయే వ‌ర‌కు కుక్క‌ర్ ను క‌దిలించ‌కుండా ఉంచాలి. ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి అంతా ఒక‌సారి క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది.

Tags: Aloo Pulao
Previous Post

Muskmelon Sharbat : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Next Post

Papaya : ప‌ర‌గ‌డుపున బొప్పాయి పండును తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.