Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. మార్చి 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై ఏకంగా 55 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వన్‌ప్లస్, షియోమీ, రెడ్‌మీ, శాంసంగ్ టీవీలపై ఆఫర్లను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో టీవీని కొంటే రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా ఐసీఐసీఐ కార్డులతో 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక ఎల్‌జీకి చెందిన 32 ఇంచులు మొదలుకొని 55 ఇంచుల టీవీలు రూ.15,999 నుంచి రూ.45,999 మధ్యలో లభిస్తున్నాయి.
అదేవిధంగా వన్‌ప్లస్‌కు చెందిన టీవీల ప్రారంభ ధర రూ.16,499 ఉండగా.. వీటీపై సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతోనూ ఆఫర్లను పొందవచ్చు. రెడ్‌మీ టీవీలు రూ.13,499 ప్రారంభ ధరకు లభిస్తుండగా.. ఈ కంపెనీకి చెందిన హై ఎండ్ మోడల్స్ గరిష్టంగా రూ.28,999 ధరకే లభిస్తున్నాయి. అలాగే శాంసంగ్, సోనీ, వీయూ, అకాయ్, ఒనిడా, ఐఫాల్కన్, టీసీఎల్ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలను కూడా తగ్గింపు ధరలకే అందిస్తున్నారు.