Cucumber : ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజూ అనేక ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగానే అనేక మందికి వ్యాధులు వస్తున్నాయి. అయితే అలాంటి వారు తాము రోజూ తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కీరదోసను తీసుకుంటే ఒత్తిడికి చెక్ పెట్టడమే కాకుండా.. ఇంకా అనేక సమస్యలను తగ్గించుకోవచ్చని అంటున్నారు. మరి కీరదోసను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కీరదోసును ఈ సీజన్‌లో తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గుతుంది. శరీరం చల్లగా మారుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా సురక్షింతగా ఉండవచ్చు. వేసవి తాపం తగ్గుతుంది. శరీరానికి నీరు బాగా లభిస్తుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు.
2. అధిక బరువు, డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు కీరదోసను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
3. కీరదోసలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. కనుక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
4. కీరదోసలో జింక్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. వీర్యం ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. అలాగే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
5. కీరదోసను తింటే మూత్రాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కిడ్నీల్లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. కీరదోసను తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. దీంతో క్యాన్సర్లు రావు. అలాగే వీటిలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.
6. కీరదోసను తినడం వల్ల అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం నుంచి బయట పడవచ్చు.