Amazon : ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో మరో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్ అప్‌గ్రేడ్ సేల్ పేరిట ఇప్పటికే ఈ సేల్ ప్రారంభం కాగా ఈ సేల్ ఈనెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్‌లో వన్‌ప్లస్, షియోమీ, శాంసంగ్, యాపిల్, వివో, ఒప్పో కంపెనీలకు చెందిన బ్రాండ్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను పొందవచ్చు. అలాగే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
శాంసంగ్‌కు చెందిన ఎస్20 ఎఫ్ఈ 5జి, ఎస్22 అల్ట్రా, వన్ ప్లస్ నార్డ్ సీఈ2, రెడ్‌మీ నోట్ 10 సిరీస్ ఫోన్లు, రెడ్‌మీ 9ఎ స్పోర్ట్స్, రెడ్‌మీ టీవీలు, సోనీ, శాంసంగ్, వన్‌ప్లస్ టీవీలపై ఆఫర్లను అందిస్తున్నారు.
ఇక సేల్‌లో Samsung S20 FE 5G ఫోన్‌ను రూ.36,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే శాంసంగ్ ఎస్22 అల్ట్రా ఫోన్‌పై రూ.5వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 12 ఫోన్‌ను రూ.52వేల ప్రారంభ ధరకు కొనవచ్చు. ఐక్యూ జడ్3, జడ్5 ఫోన్లను రూ.15,990, రూ.18,490 ధరలకు కొనవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2, వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్లను రూ.22,499, రూ.28,499 ధరలకు కొనవచ్చు. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తోంది.
ఈ సేల్‌లో వన్ ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ రూ.38,999 ధరకు లభిస్తోంది. అలాగే వన్‌ప్లస్ 9ఆర్ రూ.32,499కి, వన్‌ప్లస్ 9 ప్రొ రూ.51,999 ధరకు, వన్‌ప్లస్ 9 రూ.36,999 ధరకు లభిస్తున్నాయి. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతోపాటు రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తున్నారు.
అలాగే ఒప్పో ఎ 54 ఫోన్‌ను రూ.11,691 ధరకు, ఒప్పో ఎ15ఎస్ ఫోన్ ను రూ.9,891 ధరకు, టెక్నో స్పార్క్ 8టి ఫోన్‌ను రూ.8,369 ధరకు, స్పార్క్ 8సి ఫోన్‌ను రూ.7,019 ధరకు కొనవచ్చు.
ఇక టీవీల విషయానికి వస్తే.. సోనీ బ్రేవియా టీవీలు రూ.28వేల ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. అలాగే అమెజాన్ బేసిక్స్, వన్‌ప్లస్, రెడ్‌మీ, శాంసంగ్ టీవీలపై కూడా 40 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. దీంతోపాటు అన్ని కంపెనీలకు చెందిన టీవీలపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
సేల్‌లో సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో మూడు నెలలు అదనంగా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.