Aryan Khan : గతేడాది అక్టోబర్ 2వ తేదీన ముంబైలోని సముద్ర ప్రాంతంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేసి మొత్తం 14 మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాగే పలువురు బిగ్‌షాట్స్‌కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించినట్లేనని తెలుస్తోంది.
ఆర్యన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన తరువాత కొన్ని రోజుల పాటు అతన్ని రిమాండ్‌లోనే ఉంచారు. ఎన్‌సీబీ అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ లభించలేదు. అయితే అసలు ఆర్యన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఏమీ సాక్ష్యాలు లేవన్న కారణంతో.. న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించగా.. కోర్టు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆర్యన్‌ఖాన్ కు వ్యతిరేకంగా ఎన్‌సీబీ అధికారులు సాక్ష్యాధారాలను వేటినీ సమర్పించలేదట.
క్రూయిజ్ షిప్‌పై దాడి చేసినప్పుడు ఎన్‌సీబీ అధికారులు అక్కడ వీడియోలు తీయలేదు. వాస్తవానికి ఇలాంటి సంఘటనల్లో ఎప్పుడైనా సరే ఎన్‌సీబీ అధికారులు వీడియోలు తీస్తారు. కానీ ఆ షిప్ మీద దాడి చేసినప్పుడు వీడియోలు తీయలేదు. దీంతో ఆ వీడియోలను కోర్టుకు సమర్పించలేకపోయారు. అలాగే ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు, అమ్మినట్లు ఎక్కడా సాక్ష్యాలను కూడా రాబట్టలేకపోయారు. దీంతో ఆర్యన్ ఖాన్‌కు ఈ కేసులో ఊరట లభిస్తుందని.. అతనికి క్లీన్ చిట్ వస్తుందని తెలుస్తోంది. ఎన్‌సీబీ అధికారులు అలా వీడియో తీయకుండా చేసిన చిన్న పొరపాటు వల్ల ఆర్యన్‌ఖాన్ ఇప్పుడు సులభంగా ఈ కేసు నుంచి క్లీన్ చిట్‌తో బయట పడుతున్నాడని తెలుస్తోంది.