Viral Video : సాధారణంగా పెళ్లిళ్లు అంటే ఎంతో సందడిగా జరుగుతుంటాయి. వధూవరులు సంతోషంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వివాహం చేసుకుంటారు. కానీ అక్కడ మాత్రం రసాభాసగా పెళ్లి అయింది. వివాహం అయ్యాక దండలు మార్చుకునే సమయంలో వధూవరులు ఇద్దరూ స్టేజిపైనే చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది.

ఓ జంట వివాహ వేడుక సందర్బంగా స్టేజిపై దండలు మార్చుకున్నారు. అనంతరం వధువుకు వరుడు స్వీట్ తినిపించబోయాడు. కానీ ఆమె వద్దన్నట్లుగా తలను పక్కకు తిప్పుకుంది. దీంతో విసుగు చెందిన వరుడు ఆ స్వీట్‌ను ఆమె ముఖం మీద కొట్టాడు.
https://www.facebook.com/100030636017498/videos/457431046080436/
అయితే వరుడు చేసిన ఆ పనికి చిర్రెత్తుకొచ్చిన వధువు కూడా ఇంకో స్వీట్ తీసుకుని అతనిపై కొట్టింది. దీంతో ఆ వరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తాము పబ్లిగ్గా ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి వధువు చెంప చెళ్లుమనిపించాడు. వధువు కూడా అతనిపై దాడి చేసింది. ఇలా పరస్పరం కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తరువాత ఏం జరిగింది ? అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ? ఎప్పుడు జరిగింది ? అన్న వివరాలు తెలియవు. కానీ ఈ వీడియోను చూసి మాత్రం నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.