Boti Gongura Fry : మాంసాహార ప్రియులకు బోటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బోటి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా కూర లేదా ఫ్రైగా చేసి తీసుకుంటారు. బోటి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ చేసే బోటి ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూర వేసి చేసే ఈ బోటి ప్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. మరింత రుచిగా గోంగూర వేసి బోటి ప్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బోటి గోంగూర ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన గోంగూర – ఒక కట్ట, చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీటిలో ఉడికించి శుభ్రం చేసిన బోటి – 500 గ్రా., ఉప్పు – తగినంత, నీళ్లు – 200 ఎమ్ ఎల్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – గుప్పెడు.
బోటి గోంగూర ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి వేయించాలి. మసాలాలన్నీ వేగిన తరువాత గోంగూర వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. తరువాత బోటి వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి బోటి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
అవసరమైతే మరికొద్దిగా నీటిని పోసి ఉడికించాలి. బోటి మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బోటి గోంగూర ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే బోటి ఫ్రై కంటే ఈ విధంగా తయారు చేసిన బోటి ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బోటి ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.