Lakshmi Devi : జోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ వస్తువులను ఉంచుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల మనకు శుభాలు కలుగుతాయి. అలాగే కొందరు ఎంత కష్టపడి పని చేసినా చేతిలో డబ్బు నిలవదు. ఆర్థి సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వారు కూడా ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచుకోవాల్సిన 5 వస్తువులు ఏమిటో… ఇవి మనకు ఎలాంటి ఫలితాలను కలిగిస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండాల్సిన వాటిలో తులసి చెట్టు ఒకటి. ఇంట్లో తులసి చెట్టు ఉండడం చాలా శుభప్రదం. హిందూ ధర్మాల ప్రకారం తులసి చెట్టులో లక్ష్మీదేవి, విష్ణువు నివసిస్తారు.
తులసి చెట్టును ఇంట్లో ఉంచుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఇంట్లో తులసి చెట్టును ఉంచుకుంటే తులసి చెట్టు ముందు నిత్యం దీపాన్నివెలిగించాలి. అలాగే ఇంట్లో ఉండాల్సిన వాటిలో చీపురు ఒకటి. చీపురును కూడా లక్ష్మీ దేవిగా భావిస్తూ ఉంటారు. చీపురుతో నిత్యం ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటుంది. అదేవిధంగా జోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలును ఉంచుకోవడం శ్రేయస్కరం. ఇంట్లో తాబేలు ఉంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. డబ్బుకు లోటు ఉండదు. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తారు. ఇంటికి ఉత్తర దిశలో తాబేలును ఉంచడం వల్ల ఆర్థికంగా బలంగా తయారవుతారు. అలాగే ఇంట్లో శ్రీయంత్రాన్ని ఉంచుకోవాలి. శ్రీ యంత్రం కూడా చాలా శుభప్రదమైనది.
ప్రతి శుక్రవారం శ్రీ యంత్రానికి పూజ చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థికంగా బలంగా తయారవుతారు. ఇక ఇంట్లో ఉంచుకోవాల్సిన వాటిలో గోమతి చక్రం కూడా ఒకటి. గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కునే వారు తప్పకుండా ఇంట్లో గోమతి చక్రాన్ని ఉంచుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు పడే వారు సమస్యల నుండి బయటపడాలంటే 11 గోమతి చక్రాలను పసుపుగుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ 5 వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆర్థికంగా బలంగా తయారవుతామని జోతిష్య పండితులు చెబుతున్నారు.