Brinjal Curry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వంకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు. ఈ వంకాయలతో సులువుగా అయ్యేలా అదే విధంగా రుచిగా ఉండేలా చక్కటి కూరను తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. రుచిగా, సులభంగా వంకాయలతో కూరను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – అరకిలో, తరిగిన టమాటాలు – 2, ఉడికించిన పచ్చి బఠాణీ – 100 గ్రా., పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. మరలా మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత బఠాణీ, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత పావు టీ గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా వండుకుని తినవచ్చు. ఈవిధంగా తయారు చేసిన వంకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.