Lemon : మనం నిత్య జీవితంలో నిమ్మకాయను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మరసం వేసి చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. నిమ్మకాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ కూడా నిమ్మకాయను అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. బరువు తగ్గడంలో, బరువు పెరగడంలో, చర్మను సంరక్షించడంలో, జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో నిమ్మకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే జీర్ణశక్తిని పెంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, శరీరంలో ఉండే మలినాలను తొలగించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో కూడా నిమ్మకాయ మనకు సహాయపడుతుంది. నిమ్మకాయను ఉపయోగించడం వల్ల శరీరంలో పిహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడే వారు చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపి తీసుకోవడం వల్ల లావు పెరగకుండా బరువు మాత్రమే పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా, సన్నగా ఉన్న వారు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే దంతాలను తెల్లగా మార్చే గుణం కూడా నిమ్మరసానికి ఉందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఉప్పు, పసుపు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల దంతాల సమస్యలు తొలగడంతో పాటు దంతాలు తెల్లగా మారతాయి. అలాగే మనం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు బ్రష్ పై నిమ్మరసాన్ని పిండి తరువాత టూత్ పేస్ట్ ను ఉంచి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా నిమ్మరసంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు చక్కగా మెరుస్తాయి.
అలాగే చాలా మంది ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు నిమ్మకాయను వాసన చూడడం లేదా నిమ్మరసాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం వల్ల ప్రయాణాల్లో వికారం, వాంతులు అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.