Cauliflower Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీప్లవర్ కూడా ఒకటి. క్యాలీప్లవర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దీనితో మనం ఎక్కువగా ఫ్రై, కూర, పరాటా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం క్యాలీప్లవర్ తో నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాలీప్లవర్ తో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాలీప్లవర్ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన క్యాలీప్లవర్ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), మెంతులు – అర టేబుల్ స్పూన్, ఆవాలు -ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.
క్యాలీప్లవర్ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక ళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసివేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ముక్కలు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. క్యాలీప్లవర్ ముక్కలు చల్లారిన తరువాత కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. చివరగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ పచ్చడిని గాజు సీసాలో నిల్వ చేసుకుని ఒక రోజంతా అలాగే ఉంచాలి.
పచ్చడి బాగా ఊరి నూనె పైకి తేలిన తరువాత మరోసారి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ నిల్వ పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే చాలా కమ్మగా ఉంటుంది. తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా క్యాలీప్లవర్ తో ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.