Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Cauliflower Paratha : కాలిఫ్ల‌వ‌ర్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే ప‌రాటాల‌ను చేయ‌వచ్చు.. ఎలాగో తెలుసా..?

D by D
January 12, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Cauliflower Paratha : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. కూర‌లే కాకుండా క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ప‌రోటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. క్యాలీప్ల‌వ‌ర్ తో రుచిగా ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
గోబి ప‌రాట త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – రెండు క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టీ స్పూన్స్, క్యాలీప్ల‌వ‌ర్ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్.

Cauliflower Paratha recipe in telugu very easy method to make
Cauliflower Paratha

గోబి ప‌రాట త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి పిండిని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ను శుభ్ర‌ప‌రిచి చిన్న‌గా తురుముకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ తురుము, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ క్యాలీప్ల‌వ‌ర్ ను పూర్తిగా మ‌గ్గించాలి. క్యాలీప్ల‌వ‌ర్ పూర్తిగా వేగిన త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని మ‌రోసారి బాగా క‌లిపి ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చెక్క అప్ప లాగా వ‌త్తుకోవాలి.

త‌రువాత అందులో ఒక‌టి లేదా ఒక‌టిన్న‌ర టీ స్పూన్ మోతాదులో క్యాలీప్ల‌వ‌ర్ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసి వేయాలి. త‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా కాకుండా చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక ప‌రాటాను వేసి ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి. త‌రువాత నూనె లేదా బ‌ట‌ర్ వేస్తూ రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి ప‌రాటాలు త‌యారవుతాయి. వీటిని రైతాతో లేదా ట‌మాట ప‌చ్చ‌డితో క‌లిపి తింటే రుచిగా ఉంటాయి. క్యాలీప్ల‌వ‌ర్ ను తిన‌ని వారు కూడా ఈ విధంగా చేసిన ప‌రాటాల‌ను ఇష్టంగా తింటారు.

Tags: Cauliflower Paratha
Previous Post

Papaya Juice : బొప్పాయి పండ్ల జ్యూస్‌ను ఇలా చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Next Post

Garlic For Cholesterol : వెల్లుల్లిని రోజూ ఇలా తీసుకోండి.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.