Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Cold Coco : స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. చ‌ల్ల చ‌ల్ల‌ని కోల్డ్ కోకో డ్రింక్‌.. త‌యారీ ఇలా..!

D by D
April 6, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Cold Coco : మ‌నం కాఫీ షాపుల్లో ర‌క‌ర‌కాల చాక్లెట్ డ్రింక్స్ ను, చాక్లెట్ మిల్క్ షేక్స్ న‌పు తాగుతూ ఉంటాం. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న షాపుల్లో కూడా చాక్లెట్ డ్రింక్స్ ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు ల‌భించే వివిధ ర‌కాల చాక్లెట్ డ్రింక్స్ లో కోల్డ్ కోకో కూడా ఒక‌టి. ఈ చాక్లెట్ డ్రింక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంత తాగినా త‌నివి తీర‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. వేసవి కాలంలో తాగ‌డానికి ఇది ఒక్క చ‌క్క‌టి డ్రింక్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ కోల్డ్ కోకోను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా దీనిని తేలిక‌గా చేసుకోవ‌చ్చు. చ‌ల్ల‌చ‌ల్ల‌గా రుచిగా ఉండే ఈ కోల్డ్ కోకో త‌యారీ విధానాన్ని.. అలాగే త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కోల్డ్ కోకో త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, చిక్క‌టి పాలు – 500 ఎమ్ ఎల్, పంచ‌దార – 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కోకో పౌడ‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, డార్క్ చాక్లెట్ చంక్స్ – అర క‌ప్పు, చాక్లెట్ సిర‌ప్ – కొద్దిగా.

Cold Coco recipe in telugu summer special cool drink
Cold Coco

కోల్డ్ కోకో త‌యారీ విధానం..

ముందుగా కళాయిలో నీళ్లు పోయాలి. త‌రువాత 400 ఎమ్ ఎల్ పాలు పోసి క‌లుపుతూ వేడి చేయాలి. పాలు పొంగు వ‌చ్చిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. పంచదార క‌రిగే లోపు మ‌రో గిన్నెలో 100 ఎమ్ ఎల్ పాలు తీసుకోవాలి. త‌రువాత ఇందులో కార్న్ ఫ్లోర్, కోకో పౌడ‌ర్ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని మ‌రుగుతున్న పాల‌ల్లో కొద్ది కొద్దిగా వేస్తూ క‌ల‌పాలి. త‌రువాత డార్క్ చాక్లెట్ చంక్స్ వేసి అవి క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. చాక్లెట్ క‌రిగిన త‌రువాత ఈ పాల‌ను వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ గిన్నెను 5 గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. పూర్తిగా చ‌ల్లారిన ఈ పాల‌ను బ్లెండ‌ర్ లో వేసి హైస్పీడ్ మీద బీట్ చేసుకోవాలి. త‌రువాత స‌ర్వింగ్ గ్లాస్ ను తీసుకుని దాని అంచుల వెంబ‌డి చాక్లెట్ సిర‌ప్ ను వేసుకోవాలి. త‌రువాత బీట్ చేసుకున్న చాక్లెట్ పాల‌ను పోసుకోవాలి. ఈ పాల‌పై డార్క్ చాక్లెట్ ముక్క‌ల‌ను వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోల్డ్ కోకో త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు.

Tags: Cold Coco
Previous Post

Nela Usiri Plant : ఈ మొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Next Post

Mutton Haleem : స్పెష‌ల్ మ‌ట‌న్ హ‌లీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Related Posts

హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.