సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ధృవ్ రాఠీ పేరు తెలిసే ఉంటుంది. 29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. అతను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అతనకు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో బాగా హల్చల్ చేశాయి. అయితే ధృవ్ ఇటీవలి కాలంలో బీజేపీకి వ్యతిరేఖంగా పలు వీడియోలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా, ఆయన పాలనలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయంటూ, ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ధృవ్ రాఠీ చేస్తున్న కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఎన్డీయేలో భాగమైన పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం చర్చనీయీంశం అయింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సెటైర్లు విసిరుతూ వార్తలలోకి ఎక్కాడు. పవన్ కల్యాణ్ మంచి నటుడు అంటూ సెటైరికల్ కామెంట్ చేసిన ఆయన.. హిందూ మతానికి చెందిన ఇద్దరు పెళ్లాలను వదిలేసి, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్ నిజంగానే సనాతన యోధుడు. ఆయను చూసి గర్వపడాలి’ అంటూ ధ్రువ్ రాతీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. పవన్ కళ్యాణ్ 11 ఏళ్లు ఉపవాస దీక్ష చేసిన కూడా ఏం జరుగుతుంది, ఏం జరగదు అని ధృవ్ తన సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తెలియజేశాడు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ-ముస్లింల విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ పలు ఆరోపణలు చేశారు. రెండు రూపాయల అంధ భక్తులకి పవన్ కళ్యాణ్‌లో ఓ సెక్యూలర్ సనాతన కనిపిస్తున్నారని, అన్నిమతాలకి గౌరవం ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ధృవ్.. పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు చేస్తుండగా, దీనిపై పవన్ ఏమైన స్పందిస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.