Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Egg Keema Masala Curry : కోడిగుడ్ల‌తో ఎగ్ కీమా మ‌సాలా కర్రీ.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..

D by D
January 4, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Egg Keema Masala Curry : మ‌నం కోడిగుడ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్లు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ కీమా మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. దీనిని రెస్టారెంట్ ల‌లో, ధాభాల‌లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ కీమా మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తో ఎగ్ కీమా మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ కీమా మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2 ( పెద్ద‌వి), జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, క్యాప్సికం త‌రుగు – పావు క‌ప్పు, నీళ్లు – 125 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్.

Egg Keema Masala Curry recipe in telugu very tasty make like this
Egg Keema Masala Curry

ఎగ్ కీమా మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్, ప‌సుపు వేసి వేయించాలి. అల్లం ప‌చ్చి వాస‌న పోయిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, జీల‌క‌ర్ర పొడి, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, మిరియాల పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు కొద్దిగా మెత్త‌బ‌డిన త‌రువాత గంటెతో మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఈ ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన కోడిగుడ్ల‌ను పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేట‌ర్ తో తురుముకుని వేసుకోవాలి.

త‌రువాత కొత్తిమీరును కూడా వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించిన త‌రువాత అల్లం ముక్క‌లు, నిమ్మ‌ర‌సం, బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఖీమా మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల కంటే ఈ విధంగా చేసిన ఎగ్ ఖీమా మ‌సాలా క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ ఈ కూర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Egg Keema Masala Curry
Previous Post

Cardiac Arrest : ప్ర‌ముఖుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్న కార్డియాక్ అరెస్ట్‌.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Next Post

Dates Syrup : అమృతం లాంటి సిర‌ప్ ఇది.. ఎన్నో రోగాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.