Lord Venkateshwara : ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్న పనులు పూర్తవ్వాలని, వాళ్ళ కోరికలు తీరాలని భావిస్తారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాము. అందులో కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అవి కూడా జరగవు. కానీ మీ కోరికలు తీరాలంటే, కచ్చితంగా ఏడు శనివారాలు మీరు ఇలా చేయాలి. ఇలా కనుక చేశారంటే ఎంతటి కోరిక అయినా సరే కచ్చితంగా తీరుతుంది. శనివారం అనగానే మొదట మనకి గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి.
శనివారం నాడు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన పూజలు వెంకటేశ్వర స్వామి వారికి చేసి, వారికి కలిగే బాధలు అన్నీ కూడా దూరం అవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి శని బాధలు, దోషాలు లేకుండా చూడమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. 7 శనివారాలు ఇలా కనుక మీరు చేశారంటే బాధలు అన్నీ కూడా పోతాయి.
కోరికలన్నీ కూడా తీరుతాయి. శనివారం నాడు ఉదయాన్నే తల స్నానం చేసి, దేవుడి గదిని శుభ్రం చేసుకుని, తర్వాత స్వామివారిని అలంకరించాలి. తర్వాత మీరు బియ్యం పిండితో ప్రమిద చేసి బియ్యం పిండిలో పాలు, బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి. దానితో ప్రమిద చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి వారికి వెలిగించాలి. శనివారం సూర్యోదయం ముందు నిద్రలేచి, తులసి కోట ముందు కచ్చితంగా దీపాన్ని వెలిగించాలి.
దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె లేదంటే నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. అప్పుడు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ వెంట ఉంటుంది. శనివారం సాయంత్రమైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి, అక్కడ నేతి దీపాన్ని వెలిగిస్తే బాధలు అన్నీ కూడా పోతాయి. సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి. క్రమం తప్పకుండా ఏడు శనివారాలు ఇలా చేశారంటే కచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. బాధలన్నీ కూడా పోయి సంతోషంగా ఉంటారు.