సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్షణాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక టీచర్ కి ఒక విద్యార్థి కాళ్లు, చేతులు మర్దన చేస్తున్న వీడియో ఇది.
స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ దిలావర్ హెచ్చరించారు. వారిపై యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మహిళ టీచర్ నిద్రపోయి ఉన్నారు. అది కూడా క్లాస్ లోనే. ఆవిడ ముందు పిల్లలు నిలబడి ఆవిడ పాదాలని మసాజ్ చేస్తున్నారు. వీళ్ళు నాలుగవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. స్కూల్ ప్రిన్సిపాల్ అంజు చౌదరి మాట్లాడుతూ.. ఈ వీడియో గురించి తనకు తెలియదని.. బహుశా ఉపాధ్యాయురాలు ఆరోగ్యంగా లేరేమో అని అన్నారు. అలాగే టీచర్ వారిని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు. వీడియోని చూసినవాళ్లు విపరీతంగా టీచర్ పై మండి పడుతున్నారు. ఇటువంటి వాళ్లను ప్రోత్సహించకూడదని కామెంట్లు చేస్తున్నారు.
स्कूल टीचर का वीडियो हुआ वायरल. pic.twitter.com/ReTUYkEPoj
— Prashant rai (@prashantrai280) October 10, 2024