Guppedantha Manasu : జూలై 23న ప్రసారం అయిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగా.. శైలేంద్ర కంట పడటంతో అతను రంగానా? లేదంటే రంగా రూపంలో ఉన్న రిషినా అని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు శైలేంద్ర. ఆ సమయంలో శైలేంద్రకి వసుధార కనిపించినట్టే కనిపించి వెంటనే మాయం అవుతుంది. పాండు గ్యాంగ్‌ని చూసి పారిపోతుంది వసుధార. పాండు వసుధారని వెంబడిస్తూ ఉంటాడు. ఇక శైలేంద్ర వసుధారని వెతుక్కుంటూ వస్తాడు. ఇది నిజమా లేకుంటే కలనా అనే సందేహం వ్యక్తం చేస్తుంటాడు. అయితే అదే సమయంలో పాండు గ్యాంగ్ టీ తాగడానికి టీ కొట్టు దగ్గరకు వెళ్తుంటారు. ఇంతలో శైలేంద్ర.. వసుధార నాకు కనిపించిందంటే.. ఆ పాండు గాడు వసుధారని చంపలేదా? నాకు అబద్ధం చెప్పాడా? ఒకసారి కన్ఫామ్ చేసుకుందాం అని పాండుకి టీ కొట్టు దగ్గర నుంచే ఫోన్ చేస్తాడు శైలేంద్ర.
అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన పాండు.. శైలేంద్రకు తాను కాకినాడలో ఉన్నట్లు పాండు అబద్ధమాడతాడు.అయితే ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకోకుండా ఎదురుగా వస్తోన్న శైలేంద్రను గుద్దుతాడు పాండు. శైలేంద్రను చూసి పాండు షాకవుతాడు. ఇదేనా నువ్వు చెప్పిన కాకినాడ అంటూ పాండుకు శైలేంద్ర క్లాస్ పీకుతాడు. శైలేంద్రపైనే రివర్స్ అవుతాడు పాండు. చీటికి మాటికి నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావని కోప్పడుతాడు. అప్పుడు నువ్వు వసుధారను చంపలేదు కదా అని పాండు కాలర్ పట్టుకొని ఆవేశంగా అడుగుతాడు శైలేంద్ర. వసుధారను గోతిలో పాతిపెట్టి చాలా రోజులైందని పాండు అంటాడు. వారి మాటలను శైలేంద్ర నమ్మడు.అయితే ఆమె అస్తికలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోదామని, పోలీసులే అది వసుధార శవమో కాదో తేల్చుతారని పాండు రివర్స్ ఎటాక్ మొదలుపెడతాడు.
పాండు ఎంత చెప్పిన వినకుండా పక్కనే ఉన్న టీస్టాల్ ఓనర్‌ను అడుగుతాడు. అప్పుడు అక్కడే ఉన్న పాండు నా మాటలు నమ్మకుండా నన్ను అవమానిస్తున్నారంటూ పాండు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ అవమానం భరించడం కంటే మీ చేతిలో చనిపోవడమే మేలని పాండు సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు పాండు. దానికి వసుధారను అతడు చంపింది నిజమేనని శైలేంద్ర నమ్ముతాడు. ఇక శైలేంద్ర .. రంగా అడ్రెస్ వెతుక్కుంటూ అతని ఇంటికి వస్తాడు. అప్పుడు రంగా.. వసుధారపై కావాలని నీళ్లు పోసి లోపలికి వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకోమని ఆమె లోపలికి వెళ్లగానే తలుపు మూసి శైలేంద్ర కంట వసుధార పడకుండా దాచి పెడతాడు. ఆ తర్వాత కొంత సేపు రంగాతో మాట్లాడిన శైలేంద్ర.. సరోజ గుణగణాల గురించి రంగాను అడుగుతాడు శైలేంద్ర. నా మరదలు బంగారం అంటూ రిషి బదులిస్తాడు. ఇక వసుధార డోర్ తీసి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది.
అప్పుడు అది రాకపోవడంతో గట్టిగా తలుపు కొడుతుంటుంది. అది గ్రహించిన రంగా సరోజ వాళ్ల ఇంటికి వెళదామని శైలేంద్రను బయటకు తీసుకెళతాడు. రంగాతో మాట్లాడుతుంది శైలేంద్ర అని వసుధార గ్రహిస్తుంది. అయితే అప్పుడే అక్కడికి రాధమ్మ వచ్చి డోర్ తీయగా, శైలేంద్ర రంగా అప్పటికి కనిపించరు. సరోజా ఇంటికి వెళ్లారని తెలుసుకొని తాను కూడా అక్కడికి వెళ్లే ఆలోచన చేస్తుంది. దాంతో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది.