తిరుమల లడ్డూ వ్యవహారంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం గుప్పించుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెలరేగిపోయారు. డిక్లరేషన్ లేకుండా తిరుమల ఎలా వెళ్తావు అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ ఎన్నడూ తినని జగన్ దాని నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను హిందువును కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. నాలాగా నువ్వు చెప్పగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. ఒక దళితురాలినైన నన్నే నువ్వు ఒకనాడు తిరుమల వెళ్లనివ్వలేదని ఆమె గుర్తు చేస్తుకున్నారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా వెంకటేశ్వరస్వామికి నన్ను దూరం చేయగలిగావా అంటూ అనిత విరుచుకుపడ్డారు.
డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడని విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెట్టి.. తిరుమలకు వెళ్లిపోయి ఉంటే.. ఏ సమస్యా ఉండేది కాదు.. కానీ ఆయన.. అది తప్ప అన్నీ చేశారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏకంగా 2న్నర గంటలపాటూ ప్రెస్ మీట్ పెట్టి.. అసలు కల్తీయే జరగలేదని స్టేట్‌మెంట్ ఇచ్చే్శారు. కానీ అది చెప్పాల్సింది దర్యాప్తు సంస్థ సిట్ కదా.
జగనే అన్నీ చెప్పేస్తే, ఇక సిట్ ఎందుకు? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. జగన్‌కి కౌంటర్‌గా రాత్రి సీఎం చంద్రబాబు కూడా ప్రెస్‌మీట్ పెట్టి.. కల్తీ జరిగిందని రిపోర్ట్ చెబుతుంటే.. జరగలేదంటారేంటి అని మండిపడ్డారు. ఆ రిపోర్టును పూర్తిగా నమ్మలేకే కదా.. సిట్ వేసింది. దర్యాప్తు జరిగాక ఎలాగూ అసలు నిజం బయటపడుతుంది. అప్పటిదాకా పార్టీలు ఆగట్లేదు. మీ నోటి వెంట మానవత్వం అనే పదం పలికితే ఆ పదమే సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యంగస్త్రాలు సంధించారు. ఈ మాటలు చెప్పే ముందు దిల్లీలో వైఎస్ సునీత, గల్లీలో వైఎస్ షర్మిలలు ఎంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా అన్నారు. అలాంటి నువ్వు మానవత్వం గురించి మాట్లాడాతవా అంటూ ఫైర్ అయ్యారు.