Rice : మనం అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను, ఫ్రైడ్ రైస్ లను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు , ఫ్రైడ్ రైస్ లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే ఫ్రైడ్ రైస్ వంటి వాటిని చక్కగా, రుచిగా, పొడి పొడిగా తయారు చేయాలంటే ముందుగా మనం వండే అన్నం చక్కగా ఉండాలి. అన్నం చక్కగా, పొడి పొడిగా ఉంటేనే రైస్ వెరైటీలు కానీ, ఫ్రైడ్ రైస్ లు కానీ చాలా రుచిగా , చక్కగా ఉంటాయి. కనుక ఫ్రైడ్ రైస్, రైస్ వెరైటీ వంటి వాటిలోకి అన్నాన్ని పొడి పొడిగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లేన్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక టీ స్పూన్.
ప్లేన్ రైస్ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. తరువాత ఉప్పు, నూనె వేసి బియ్యాన్ని ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. అలాగే అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది. బాస్మతీ బియ్యం కాకుండా సాధారణ బియ్యంతో వండే వారు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీటిని పోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అన్నంతో రైస్ వెరైటీలను చేసుకుంటే చాలా రుచిగా ఉండడంతో పాటు చూడడానికి కూడా చక్కగా ఉంటాయి.