Curd : మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పాలతో పాటు పెరుగును కూడా ఆహారంగా తీసుకంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు మనకు సహాయపడుతుంది. మన ఆరోగ్యంతో పాటు అందానికి కూడా పెరుగు ఎంతో మేలు చేస్తుంది. పెరుగును వాడడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం పై ముడతలు తొలగిపోతాయి. ఈ పెరుగును ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. పెరుగులో మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుందన్న సంగతి కూడా మనకు తెలుసు.
ఈ బ్యాక్టీరియా పొట్టను శుభ్రంగా ఉండచంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో జీర్ణవ్యవస్థను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో దోహదపడుతుంది. ఈ బ్యాక్టీరియా పుల్లటి పెరుగులో ఎక్కువగా ఉంటుంది. తియ్యటి పెరుగు కంటే పుల్లటి పెరుగును తింటేనే మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పుల్లటి పెరుగును తినడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా మందికి పెరుగు యొక్క ఈ పుల్లటి రుచి నచ్చదు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించడం వల్ల పుల్లటి పెరుగు తిన్నప్పటికి మనకు ఆ రుచి తెలియకుండా చేసుకోవచ్చు. దీంతో పెరుగు పులిసినప్పటికి రుచిగా ఉంటుంది. అలాగే ఈ పుల్లటి పెరుగులో ఉండే పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనం సాధారణంగా పాలను కాచి తోడు వేసి పెరుగును తయారు చేస్తాము.
ఈ పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో మనం తీసుకున్న పాల మోతాదుకు తగినట్టు తేనెను వేసి కలపాలి. ఉదాహరణకు ఒక అర లీటర్ పాలను తీసుకుంటే అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తేనెను వేసి కలపాలి. ఇలా తేనెను కలిపిన తరువాత తోడు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగు పులిసినప్పటికి రుచిగా ఉంటుంది. అలాగే మనకు తేనె రుచి కూడా ఎక్కువగా తెలియకుండా ఉంటుంది. అలాగే మట్టి పాత్రలో పాలను కాగబెట్టి తోడు పెట్టిన పెరుగు మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలల్లో తగినంత తేనె వేసి తోడుబెట్టిన పెరుగు పులినప్పటికి రుచిగా ఉంటుంది. ఇలా పెరుగును తయారు చేసుకుని తినడం వల్ల పుల్లటి పెరుగు తిన్నామన్న భావన కలగకుండా ఉంటుంది. అలాగే పుల్లటి పెరుగును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.