ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్లను పెట్టుకుంటున్నారు. ఈ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులకు అంతా మంచే జరుగుతుంది. సమస్యల నుంచి బయట పడతారు. ముఖ్యంగా ఆర్థిక బాధలు తప్పుతాయి. అందుకని చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్‌ను పెంచుతారు. మనీ ప్లాంట్ అందరికీ తెలిసిందే. ఇక జేడ్ ప్లాంట్ అచ్చం చూసేందుకు గంగవల్లి ఆకును పోలి ఉంటుంది. దీన్ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చు.
అయితే కొందరి ఇళ్లలో ఉండే మనీ ప్లాంట్ మొక్కలు అసలు సరిగ్గా పెరగవు. ఏం చేసినప్పటికీ కూడా మనీ ప్లాంట్ మొక్క పెరగకుండా ఎండిపోతుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనీ ప్లాంట్ మొక్కలను పెరిగేలా చేయవచ్చు. మనీ ప్లాంట్ అనేది ఇండోర్ మొక్క. కనుక దానికి ఎల్లప్పుడూ సూర్యరశ్మి తగలాల్సిన పనిలేదు. సూర్యరశ్మి బాగా తగిలితే మనీ ప్లాంట్ ఎండిపోయే అవకాశం ఉంటుంది. కనుక దానికి నీళ్లను రోజూ పోయాలి. మనీ ప్లాంట్ మొక్కకు నీళ్లను రోజూ పోయడం లేదా నీటిలోనే మొక్కను ఉంచి పెంచడం చేస్తే మనీ ప్లాంట్ ఎండిపోదు. దీంతో మొక్క బాగా పెరుగుతుంది.
మనీ ప్లాంట్ మొక్కకు సహజసిద్ధమైన ఎరువులను వేయవచ్చు. లేదంటే తేయాకును కూడా ఎరువుగా వేయవచ్చు. దీంతో కూడా మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది. మనీ ప్లాంట్‌కు పాలను పోసినా అందులో ఉండే పోషకాలు మొక్క పెరిగేలా చేస్తాయి. పాలను 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని కాస్త నీరు కలిపి ఆ మిశ్రమాన్ని మనీ ప్లాంట్‌కు పోయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొక్కకు పోషకాలు లభిస్తాయి. మొక్క బాగా పెరుగుతుంది. ఈ విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల మనీ ప్లాంట్ మొక్క బాగా పెరిగేలా చేయవచ్చు. అయితే మొక్క నుంచి ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తుంటే మొక్క ఇంకా బాగా పెరుగుతుంది.