Palm : జీవితంలో చాలా మంది అనేక కష్టాలను ఎదుర్కొంటుంటారు. అనేక సమస్యల బారిన పడుతూ వాటిని పరిష్కరించుకోలేక సతమతం అవుతుంటారు. అయితే ఇలాంటి వారిలో కొందరికి అనూహ్యంగా ధనం కలసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వ్యాపారులు అయితే తమ బిజినెస్‌లలో రాణిస్తారు. ఉద్యోగులు అయితే కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అయితే అలా జరగాలంటే కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి. అలాంటి వాటిల్లో ఒకటే ఇప్పుడు మేం చెప్పబోయేది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మీ అర చేతిలో ఆంగ్ల అక్షరం హెచ్ వచ్చేలా ఆకారంలో గీతలు ఉంటే.. అలాంటి వారికి పైన చెప్పిన విధంగా అనూహ్యంగా సంపద కలసి వస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. అయితే అలాంటి వారి వయస్సు కనీసం 40 ఏళ్లకు పైన ఉండాలి. అలాగే పురుషులకు అయితే కుడిచేతో, స్త్రీలకు అయితే ఎడమ చేతిలో ఆ అక్షరం ఆకారం ఉండాలి. అలా ఉంటేనే పైన చెప్పింది జరుగుతుంది. ఇలాంటి ఆకారం చేతిలో ఉన్నవారు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇలా అర చేతిలో హెచ్ అక్షరం వచ్చేలా ఆకారంలో గీతలను కలిగి ఉన్నవారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు అయి ఉంటారట. అలాగే వారు చాలా ఉదార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారట. దానం చేయడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటారట. దీంతోపాటు ప్రతి ఒక్కరిపై జాలి చూపిస్తారట. ఇలాంటి వారికి ధనం ఆకస్మికంగా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వీరు కోటీశ్వరులు అవుతారట. అలా అయ్యాక తమ సంపదలో చాలా వరకు దానం చేస్తారట. చాలా గొప్ప గుణం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు.