జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 ఈనెల 27 వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్టీఆర్ సహా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు మొదటి వారం రోజుల పాటు అదనపు షోలకు, టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. దీంతో దేవర పార్ట్ 1కు ఉన్న పెద్ద సమస్య పోయింది. అయితే తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే సినిమా ఆర్టిస్టులను ఒక విషయం కోరిన విషయం తెలిసిందే.
సినిమాలకు గాను ఏవైనా అడగదలచుకుంటే సినిమా ఆర్టిస్టులు డ్రగ్స్‌పై ప్రేక్షకుల్లో అవగాహన కల్పించాలని, అప్పుడే సినిమాలకు రాయితీలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రగ్స్ వాడొద్దని ఒక వీడియోను రిలీజ్ చేశారు. డ్రగ్స్ వల్ల జీవితం నాశనం అవుతుందని, కన్నవాళ్లకు శోకం మిగులుతుందని, కనుక ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని ఆయన సూచించారు.
ఇక దేవర పార్ట్ 1లో జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ మూవీ ఇప్పటికేఈ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సైతం భారీ ఎత్తున చేసింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం అభిమానులను కాస్త నిరాశ పరిచినా వారు సినిమాపై మాత్రం భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.