NTR Movie : టాలీవుడ్లో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన పిన్న వయస్సులోనే పూర్తి మాస్ క్యారెక్టర్ లలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ మాస్ హీరోగా అనేక సినిమాల్లో నటించగా.. అవన్నీ హిట్ అయ్యాయి. అయితే ఈయన కెరీర్లో మాత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని మాస్ మూవీలు ఫ్లాప్ అయ్యాయి. కానీ అనూహ్యంగా అవే మూవీలు ఇతర భాషల్లో హిట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ జాబితాలో ఉన్న అలాంటి ఫ్లాప్ చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ అప్పట్లో రాజమౌళితో సింహాద్రి మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే అదే సమయంలో ఎవరితో మూవీ చేద్దామా.. అని ఆలోచిస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్‌తో కలిసి ఆంధ్రావాలా అనే సినిమా తీశారు. ఇది ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటించిన మూవీ. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఇదే సినిమాను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తీశారు. వీర కన్నడిగ అనే పేరిట తీసిన మూవీ సూపర్ హిట్ అయింది.
ఇక వి.వి.వినాయక్‌తో కలిసి ఎన్టీఆర్ తీసిన ఆది సూపర్ హిట్ అయింది. కానీ అదే వినాయక్‌తో తీసిన సాంబ ఫ్లాప్ అయింది. ఈ మూవీలోనూ ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్లో విజృంభించారు. అభిమానుల్లోనూ అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఇదే సినిమాను కన్నడలో మాండ్య పేరిట రీమేక్ చేశారు. ఇది హిట్ అయింది. దీన్నే ఏక్ రోఖా పేరిట బంగ్లాదేశ్‌లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఇది సంచలన విజయాన్ని నమోదు చేసింది. కానీ తెలుగులో మాత్రం నిరాశ పరిచింది. ఇక ఆ తరువాత మళ్లీ వినాయక్‌తో కలిసి ఎన్టీఆర్ తీసిన అదుర్స్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రాలేదు. ఇక భవిష్యత్తులో మళ్లీ ఎన్టీఆర్ వినాయక్‌కు చాన్స్ ఇస్తారో.. లేదో.. చూడాలి.