Lemon For Dishti : సాధారణంగా మన ఇంట్లో కొందరికి లేదా అందరికీ అప్పుడప్పుడు దిష్టి తగులుతుంటుంది. దిష్టి తగలడం వల్ల ఇంట్లోని వారందరికీ ఒకేసారి అన్నీ సమస్యలే వస్తాయి. ఇంట్లోని వారందరూ అనారోగ్యాల బారిన పడడమో, ఆస్తి నష్టమో జరుగుతుంటుంది. ఇంకా కొందరికి దిష్టి వల్ల విపరీతమైన సమస్యలు కూడా వస్తాయి. కనుక ఈ విధంగా జరిగితే దిష్టి తగిలినట్లు భావించాలి. ఎవరికైనా సరే దిష్టి తగిలితే సులభంగా తెలిసిపోతుంది. కనుక ఈ విధంగా జరిగే వారు దిష్టి పోయేలా పరిహారం చేయాల్సి ఉంటుంది.
అయితే చిన్నపాటి దిష్టి తగిలితే ఇంట్లో రాళ్ల ఉప్పు లేదా మిరపకాయలతో, చెప్పులతో, చీపురుతో దిష్టి తీస్తారు. కానీ దిష్టి ప్రభావం అధికంగా ఉంటే అప్పుడు ఇలాంటి పరిహారాలు పనిచేయవు. కాస్త శక్తివంతమైన పరిహారం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు అమావాస్య వచ్చే వరకు ఆగాలి. అమావాస్య వచ్చాక ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇష్టదైవానికి పూజలు చేయాలి. తరువాత ఒక నిమ్మకాయను తీసుకుని చిత్రంలో చూపినట్లు అడ్డంగా నాలుగు గాట్లు పెట్టాలి. అందులో రాళ్ల ఉప్పు, పసుపు, కుంకుమ వేయాలి. అనంతరం ఇంటికి దిష్టి తీయాలి. గుమ్మం బయట నిలబడి ఇంటికి దిష్టి తీశాక ఆ నిమ్మకాయను ఇంట్లో ప్రధాన ద్వారం పక్కన లోపలి వైపు ఉంచాలి. బయటి వారికి ఈ నిమ్మకాయ కనిపించకూడదు. ద్వారానికి ఏదైనా ఒక వైపు లోపలి దిక్కు ఈ నిమ్మకాయను పెట్టాలి.
అలా చేశాక రోజంతా నిమ్మకాయను అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ లేచి స్నానం చేసి పూజ చేసి ఆ తరువాత ఆ నిమ్మకాయను తీసి బయట పడేయాలి. దాన్ని ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి. ఇలా అమావాస్య రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే ఎంతటి దిష్టి అయినా సరే తొలగిపోతుంది. ఇంట్లోని వారికి ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. అన్నింటా విజయాలు సాధిస్తారు. అమావాస్య రోజు అతీంద్రియ శక్తుల ప్రభావం ఉంటుంది కనుక ఆ రోజే దిష్టి తీస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది.