Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Palakova : విరిగిన పాల‌ను పార‌బోయ‌కండి.. పాల‌కోవాను ఇలా చేయండి..!

D by D
July 26, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Palakova : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కాల్షియంతోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మ‌నం వేడిచేసేట‌ప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విరిగిన పాల‌ను సాధార‌ణంగా చాలా మంది పార‌బోస్తూ ఉంటారు. కానీ విరిగిన పాల‌ను పార‌బోయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే పాల‌కోవాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. విరిగిన పాల‌తో పాల‌కోవాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

make Palakova with broken milk
Palakova

పాల‌కోవా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

విరిగిన పాలు – ఒక లీట‌ర్, పంచ‌దార – ముప్పావు క‌ప్పు లేదా త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – అర టీ స్పూన్.

పాల‌కోవా త‌యారీ విధానం..

ముందుగా విరిగిన పాలలో అర టీ స్పూన్ నిమ్మ‌ర‌సం వేసి క‌లుపుకోవాలి. ఈ పాలు పూర్తిగా విరిగే వ‌ర‌కు వేడి చేయాలి. త‌రువాత ఈ పాల విరుగుడును ఒక జ‌ల్లిగంటెలోకి తీసుకుని వాటిలోని నీరు అంతా పోయేలా చేసుకోవాలి. త‌రువాత ఈ పాల విరుగుడును నీళ్లు పోసుకుంటూ మ‌రోసారి అంతా బాగా క‌డ‌గాలి. ఇలా క‌డిగిన త‌రువాత పాల విరుగుడును మ‌రో గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత పంచ‌దార‌ను వేసి చిన్న మంటపై పంచ‌దార పూర్తిగా క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి.

పాల విరుగుడులోని నీరు అంతా పోయి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప‌ప్పు గుత్తి లేదా గంటె సహాయంతో పాల విరుగుడు మిశ్ర‌మాన్ని పూర్తిగా మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ పాల‌విరుగుడు మిశ్ర‌మాన్ని త‌గిన ప‌రిమాణంలో తీసుకుంటూ బిళ్ల‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కోవా త‌యారవుతుంది. పాలు విరిగిన‌ప్పుడు వాటిని పార‌బోయ‌కుండా ఇలా పాల‌కోవాగా చేసుకుని తిన‌వ‌చ్చు. పాల విరుగుడుతో చేసిన ఈ పాల‌కోవా వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Palakova
Previous Post

Bottle Gourd Halwa : సొర‌కాయ హ‌ల్వా త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Next Post

Minapa Garelu : మిన‌ప‌గారెల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Related Posts

information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025
మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.