ప్రపంచ కుబేరుల్లో ముకేష్ అంబాని ఒకరు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన కొద్ది నెలల క్రితం తన కుమారుడి వివాహం నభూతో నభవిష్యతి అన్న విధంగా చేశాడు. ఇందుకోసం కొన్ని కోట్లు ఖర్చు చేశాడు.కోట్లాది ఆస్తులు కూడబెట్టిన ముకేష్ అంబాని చాలా లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు తొమ్మిది ఉండగా కొత్తగా కొన్నవాటితో కలిపి పది అయ్యాయి. బోయింగ్ 737 మ్యాక్స్ 9గా పిలిచే దీని విలువ రూ.పన్నెండెందల కోట్లు ఉంటుందని టాక్. దీన్ని కొన్న తర్వాత ముఖేష్ అంబానీ తన అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేపించబోతున్నారు.
తన బిజినెస్ అవసరాల కోసం ఈ బోయింగ్ ను వినియోగించనుండగా,ఇది నాన్ స్టాప్ గా 11,770 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం దీన్ని ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలోని నిర్వహణ టెర్మినల్ లో ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్లలో ఒకటైన దీన్ని త్వరలోనే ముంబయిలోని రిలయన్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. రెండు సీఎఫ్ఎంఐ లీప్ 18 ఇంజిన్ తో పని చేసే ఈ విమానం నెంబరు 8401 ఎంఎస్ఎన్. ఈ జెట్ కు సంబంధించి అన్ని ఫ్లయింగ్ పరీక్షలు పూర్తయ్యాయి. స్విట్జర్లాండ్ లోని యూరో విమానాశ్రయం బేసెల్ ముల్ హౌస్ ఫ్రీబర్గ్ లో రీమోడల్ చేశారు. స్విట్జర్లాండ్ తర్వాత బేసెల్, లండన్, జెనీవా, లుటన్ విమానాశ్రయాల్లోను పరీక్షలు చేపట్టారు. అన్నిరకాల పరీక్షలు పూర్తయిన తర్వాతే ఇది భారత్ లోకి అడుగుపెట్టింది.
బేసెల్ నుంచి న్యూఢిల్లీ రావడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది. ఆ సమయంలో ఇది 6234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ నాన్ స్టాప్ విమానంతో ఇక తన వ్యాపారాలను కూడా ముఖేష్ అంబానీ నాన్ స్టాప్ గా పరిగెత్తించనున్నారు. దీనిని బాసెల్, జెనీవా మరియు లండన్ లూటన్ విమానాశ్రయాలలో ఆరుసార్లు పరీక్షించారు. ఆగస్ట్ 2024 చివరి వారంలో బాసెల్ నుండి ఢిల్లీకి భారీ బోయింగ్ 737 మ్యాక్స్ 9చివరి ప్రయాణం పూర్తయింది. మొత్తం ప్రయాణం తొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయంలో 6,230 కి.మీ. ప్రయాణించినట్టుగా తెలుస్తుంది.