Oats Beetroot Masala Dosa : అధిక బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాలుగా శ్రమిస్తుంటారు. కొందరు జిమ్‌లకు వెళ్తారు. ఇంకొందరు వాకింగ్ లేదా వ్యాయామం చేస్తారు. అయితే ఏం చేసినా బరువు తగ్గడం లేదని కొందరు వాపోతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మనం బరువు తగ్గకపోవడానికి మనం తినే తిండి కూడా కారణమవుతుంది. అందువల్ల మనం రోజూ తినే తిండిలోనూ పలు మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆహారంలో భాగంగా మీరు గనక ఇప్పుడు చెప్పబోయే దోశలను రోజూ తింటే మీరు ఎంతో సులభంగా బరువు తగ్గుతారు. ఇంతకీ అసలు ఆ దోశలు ఏమిటంటే.. ఓట్స్ బీట్‌రూట్ మసాలా దోశలు. ఇవి టేస్టీగా ఉండడమే కాదు, ఎన్నో పోషకాలను మనకు అందిస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఓట్స్‌ను ఫైబర్‌కు పవర్‌హౌస్‌గా చెప్పవచ్చు. ఓట్స్‌ను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా శరీరంలో చేరే క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే ఓట్స్‌లో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలైన జింక్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఉంటాయి. ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్, బీటా గ్లూకాన్‌లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన శరీరంలో క్యాలరీలను త్వరగా ఖర్చు చేయడంలో ఎంతగానో సహాయపడుతుందని వెల్లడైంది. కనుక ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఓట్స్, బీట్ రూట్ కలిపి దోశ..
బీట్‌రూట్ కూడా మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. బీట్‌రూట్‌ను మనం ఏ విధంగా అయినా సరే తీసుకోవచ్చు. దీన్ని సలాడ్స్, సూప్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే ఓట్స్, బీట్‌రూట్ రెండింటినీ కలిపి మీరు మసాలా దోశలను వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బరువు తగ్గేందుకు ఎంతో దోహదపడతాయి. ఇక ఓట్స్ బీట్ రూట్ మసాలా దోశలను ఎలా తయారు చేయాలో, వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్‌ను కాస్త వేయించి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. బీట్‌రూట్ ముక్కలను ఉడకబెట్టి అనంతరం వాటిని కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఓట్స్ పొడిలో పెరుగు, ఉప్పు, మసాలాలు, బీట్‌రూట్ పేస్ట్ వేసి బాగా కలపాలి. పిండిని దోశ పిండిలా సిద్ధం చేయాలి. అవసరం అయితే నీళ్లను కలుపుకోవచ్చు. ఇలా కలిపిన పిండిని మీరు దోశలుగా వేసి రెండు వైపులా బాగా కాల్చి అనంతరం పెనంపై నుంచి తీయాలి. ఈ దోశలను కొబ్బరి లేదా పల్లి చట్నీ, టమాటా చట్నీతో తినవచ్చు.
పనీర్ స్టఫ్‌తోనూ తినవచ్చు..
అయితే ఈ దోశలను పనీర్ స్టఫ్‌తోనూ తినవచ్చు. అందుకు గాను దోశ వేసే సమయంలో ముందుగా సిద్ధం చేసుకున్న పనీర్ స్టఫ్‌ను దోశపై పెట్టాలి. ఇక పనీర్ స్టఫ్ ను ఎలా చేయాలంటే.. పనీర్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. దోశ వేసేటప్పుడు ఈ స్టఫింగ్‌ను దోశపై పెట్టి దోశను బాగా కాల్చి తీయాలి. దీంతో ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే ఈ దోశలను తినవచ్చు. ఇలా ఓట్స్ బీట్‌రూట్ మసాలా దోశలను వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు తరచూ ఈ దోశలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.