Ghee : చిన్నతనం నుంచి మనం నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. నెయ్యిని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వాడుతున్నారు. నెయ్యిని రోజూ కొందరు భోజనంలో వేసి తింటారు. కొందరు దీంతో అనేక తీపి వంటకాలను తయారు చేసి తింటారు. అయితే నెయ్యిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయి. నెయ్యి మనకు ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. దీంట్లో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నెయ్యిని తింటే మన శరీర ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
నెయ్యిని తింటే మన శరీరం పోషకాలను కూడా సరిగ్గా శోషించుకుంటుంది. నెయ్యిని రోజూ పరిమిత మోతాదులో తీసుకుంటే అది మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని రోజూ పరిమిత మోతాదులో తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగి అదిక బరువు తగ్గుతారు. అందువల్ల అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి నెయ్యి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
నెయ్యిని తినడం వల్ల మన శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. అయితే నెయ్యిని తీసుకోవడంలోనే చాలా మంది అనేక తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిని ఎల్లప్పుడూ వేడి పదార్థాలతోనే తీసుకోవాలి. చల్లని ఆహారాలతో తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో అజీర్తి ఏర్పడుతుంది. అలాగే నెయ్యిని తేనెతో కలిపి తిన్నా కూడా జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. కనుక రెండింటినీ తీసుకునే సమయంలో కాస్త గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి.
ఇక శరీరంలో ఆమం ఎక్కువగా ఉంటే నాలుకపై తెల్లని కోటింగ్‌లా ఉంటుంది. ఇలాంటి వారు బద్దకంగా ఉంటారు. ఏ పని చేయాలనిపించదు. మలబద్దకం సమస్య ఉంటుంది. నిరంతరాయంగా అలసటగా అనిపిస్తుంది. ఆకలి ఉండదు. ఈ లక్షణాలు ఉంటే శరీరంలో ఆమం ఉన్నట్లే. అయితే ఇలా ఆమం ఎక్కువగా ఉన్నవారు కూడా నెయ్యిని తీసుకోరాదు. తింటే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక నెయ్యిని తీసుకోవడంలో ఎట్టి పరిస్థితిలోనూ ఈ పొరపాట్లను అసలు చేయకండి. లేదంటే అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు.