Reena Dwiwedi : ఎన్నికల సమయంలో అప్పట్లో విధులు నిర్వర్తించిన ఈ లేడీ ఆఫీసర్ గుర్తుందా ? ఈమె ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఈమె ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అయితే ఇప్పుడీమె మళ్లీ కనిపించి అలరించింది. కానీ సారి అప్పట్లో మాదిరిగా పసుపు రంగు చీరను ధరించలేదు. మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో లక్నోలో పీడబ్ల్యూడీ అధికారిణిగా విధులు నిర్వర్తించిన రీనా ద్వివేది ఫొటో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో ఆమె పసుపు రంగు చీరను ధరించింది. దీంతో ఆమెను లేడీ ఇన్ యెల్లో శారీ అని పిలిచారు. ఇక తాజాగా ఆమె మరోమారు ఎన్నికల విధుల్లో పాల్గొంది. ఈసారి నలుపు రంగు టాప్, ప్యాంట్స్ ధరించింది. ఈ క్రమంలోనే మరోమారు ఆమెను కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
ఇక ఈసారి డ్రెస్ ఎందుకు మార్చారని అడిగితే.. ఎప్పుడూ ఒకే డ్రెస్ ధరిస్తే ఏం బాగుంటుంది, కొద్దిగా చేంజ్ చేయాలి కదా.. అని సమాధానం చెప్పింది. ఇక అప్పట్లో ఈమెకు బిగ్ బాస్‌లో ఆఫర్ వస్తుందని భావించారు. కానీ రాలేదు. కానీ బిగ్ బాస్‌లో పాల్గొనాలనేది తన కోరిక అని ఈమె తెలియజేసింది. ఇక ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోవర్లు ఎక్కువగానే ఉన్నారు. మొత్తం 2 లక్షలకు పైగానే ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు ఈమె తన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.