RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్‌టీఆర్, రామ్‌చరణ్, ఆలియాభట్‌లు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం.. RRR. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక RRR సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి అసలు ఎంత బడ్జెట్ పెట్టారు ? సినిమా తీసినందుకు మొత్తం ఎంత ఖర్చు అయింది ? అన్న వివరాలు ఏవీ ఇప్పటి వరకు తెలియదు. కానీ ఆ వివరాలను తాజాగా చెప్పేశారు.

ఏపీ మంత్రి పేర్ని నాని RRR సినిమాకు పెట్టిన మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించారు. ఈ సినిమా తీసినందుకు మొత్తం రూ.336 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. అయితే ఇందులో నటీనటుల రెమ్యునరేషన్ వివరాలను మాత్రం కలపలేదు. వాటిని కూడా కలిపితే.. మొత్తం రూ.600 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ లకు చెరో రూ.45 కోట్లు, ఆలియా భట్‌కు రూ.9 కోట్లు, అజయ్ దేవగన్‌కు రూ.25 కోట్లు ఇచ్చినట్లు టాక్. ఇక దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు వచ్చే లాభాల్లో 30 శాతం వాటా తీసుకుంటారని సమాచారం.
కాగా RRR మూవీ ఇంకా రిలీజ్ కాక ముందే.. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్.. అన్నీ కలిపి రూ.700 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అంటే.. సినిమా విడుదల కాకముందే నిర్మాతకు పెట్టిన ఖర్చు మొత్తం వచ్చేసిందన్నమాట. ఇక రిలీజ్ అయ్యాక వచ్చేవన్నీ లాభాలే అని తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్లను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.