Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి గాను అదనపు షోస్‌ను ప్రదర్శించుకోవడంతోపాటు టిక్కెట్ల రేట్లను కూడా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు అనుమతినిచ్చింది. దీంతో పెరిగిన రేట్ల ప్రకారం తొలి వారం లేదా 10 రోజుల పాటు టిక్కెట్లను విక్రయిస్తారు. అలాగే ప్రభుత్వం అనుమతించిన మేరకు అదనపు షోలను కూడా ప్రదర్శిస్తారు.
తొలి రోజు అర్థరాత్రి 1 గంటకు స్పెషల్ షోను ప్రదర్శిస్తారు. అలాగే అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచి 6 షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. స్పెషల్ షోస్‌కు టిక్కెట్ ధరను వంద రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌లలో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.
ఇక దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటించిన విషయం తెలిసిందే. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. దీంతో ఈ మూవీపై జాన్వీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అటు ఎన్టీఆర్, ఇటు జాన్వీ ఇద్దరూ ఫ్యాన్స్‌కు వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడం బాధగా ఉందని, దేవర సినిమాకు చెందిన అనేక విశేషాలను తన ఫ్యాన్స్‌తో పంచుకోవాలని అనుకున్నానని, కానీ ఈవెంట్ రద్దవడం బాధగా ఉందన్నారు. తన సినిమాను తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.
ఇక జాన్వీ కపూర్ కూడా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను తప్పకుండా చూడాలని, బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని ఆమె కోరింది. దీంతో జాన్వీ తెలుగుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె వీడియోను వైరల్ చేస్తున్నారు.