Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Kothimeera Rice : రుచిగా త్వ‌ర‌గా చేసుకునే రెసిపి.. ట‌మాటా కొత్తిమీర రైస్‌.. త‌యారీ ఇలా..!

D by D
December 8, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Kothimeera Rice : మ‌నం అన్నంతో వివిధ ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. మ‌నం త‌యారు చేసే ఈ రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌ల్లో ట‌మాట కొత్తిమీర రైస్ కూడా ఒక‌టి. కొత్తిమీర‌, ట‌మాట వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే మిగిలిన అన్నంతో కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ట‌మాట కొత్తిమీర రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట కొత్తిమీర రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, బిర్యానీ ఆకు – 1, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఎండుమిర్చి – 2, ప‌చ్చిమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, కొత్తిమీర క‌ట్ట – మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన పెద్ద ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, అన్నం – 2 క‌ప్పులు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Kothimeera Rice recipe very easy to make and tasty
Tomato Kothimeera Rice

ట‌మాట కొత్తిమీర రైస్ త‌యారీ విధానం..

ముందుగా కొత్తిమీర‌ను పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత కొత్తిమీర పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బడిన త‌రువాత ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర రైస్ త‌యార‌వుతుంది. రైతాతో తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట కొత్తిమీర రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Kothimeera Rice
Previous Post

Pippi Pannu : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే ఈ చిట్కాను పాటించండి..!

Next Post

Street Style Aloo Parotha : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై అమ్మే ఆలు ప‌రోటాల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!