Tottempudi Venu : తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ వేణుకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. దాంతో వేణును ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారు. కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వేణు పొలిటికల్ మరియు సినిమా బ్యాగ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా వాళ్లతోపాటు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు వేణుకు దగ్గరి బంధువులు ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు వేణుకి స్వయానా బావ అవుతారు. వేణు సోదరిని నామా వివాహం చేసుకున్నారు.
అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ వేణుకు స్వయానా మేనమామ అవుతాడు. అంతే కాకుండా నటసింహం నందమూరి బాలయ్య సైతం వేణుకు దగ్గరి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వేణుకు పెదనాన్న అవుతారు. కావూరి సాంబశివరావు కూతురు కొడుకు (మనవడు) అయిన మెతుకు మిల్లి శ్రీ భరత్ బాలకృష్ణ చిన్న కూతురును వివాహం చేసుకున్నారు. అయితే వేణు సోదరి కుమారుడినే బాలయ్య చిన్న కూతురు వివాహం చేసుకుంది. ఆ లెక్కన బాలయ్య వేణుకు అన్నయ్య అవుతాడు. ఇక వేణు కూడా నందమూరి కుటుంబంకు చాలా దగ్గర గా ఉంటాడు. బయట ఫంక్షన్ లలో పెద్దగా కనిపించకపోయినా కూడా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్, బాలయ్యలను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు.