Viral Video : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు జడేజా ఓ వైపు మైదానంలో మెరికలా కదులుతూనే మరోవైపు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. వికెట్ తీసినప్పుడు ఏదో ఒక హావభావాన్ని పలికిస్తాడు. ఇక తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ జడేజా అలాగే చేశాడు.
శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేష్ చండీమాల్ వికెట్‌ను తీసిన జడేజా సంతోషంలో పుష్పలోని తగ్గేదేలే.. భావాన్ని పలికించాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఊతపదం తగ్గేదేలే.. ఎంతో పాపులర్ అయింది. ఆ డైలాగ్ చెబుతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది. దాన్ని చాలా మంది అనుకరిస్తున్నారు. అందులో భాగంగానే రవీంద్ర జడేజా కూడా వికెట్ తీసిన అనంతరం తగ్గేదేలే.. అంటూ సైగ చేశాడు. ఈ క్రమంలోనే ఆ వీడియో వైరల్ గా మారింది.
Ravindra Jadeja's wicket celebration in Pushpa Style ????????????????????????
Main jhukega nhi saala ????????#INDvsSL #India #RavindraJadeja???? #PushpaRaj pic.twitter.com/sxoEe3UO1y— Krish Narang (@knarangg) February 24, 2022
కాగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తడబడింది. దీంతో లంక జట్టుపై భారత్ 62 పరుగుల తేడాతో అద్భుతమైన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.