Dreams And Their Meanings : మనకు కలలు రావడమనేది చాలా సహజమైన విషయం. ప్రతి ఒక్కరికి నిత్యం కలలు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని పీడకలలు అయి ఉంటాయి. ఇక కొందరికి భిన్న రకాల కలలు వస్తాయి. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం.. కలలో కనిపించినవి నిజం అయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి కలలు వస్తే.. అంటే.. కలలో ఏం చేస్తున్నట్లు కనిపిస్తే.. వేటిని మనం చూస్తే.. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. అదే మాంసం తింటున్నట్లు కలగంటే.. మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి. కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారన్నమాటే. అదే గాల్లో తేలినట్లు కనిపిస్తే ప్రయాణం చేస్తారని అర్థం. కాళ్లు, చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఖాలు, సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. అలాగే కలలో పెళ్లి కూతురును ముద్దాడుతున్నట్లు కనిపించినా మీకున్న సమస్యలు పోతాయని తెలుసుకోవాలి.
మీకు కలలో పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి. కలలో ఒంటె కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. కలలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. అలాగే మీరు కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా మీకు ఇదే ఫలితం వస్తుంది. అదే కలలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. అదే ఎగురుతున్న పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. నెమలి కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట.
మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభ కార్యం జరుగుతుందట. కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. ఇక కాలుజారి పడినట్లు కల వస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది. గుర్రం మీద నుంచి కింద పడినట్లు కల వస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుందట. గుర్రం ఎక్కినట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయట.
సముద్రం, వికసిస్తున్న పూలు, యువతితో కలవడం లేదా చూడడం, ప్రసాదం లభించినట్లు, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, పాము కరిచినట్లు, ఆలయాన్ని చూసినట్లు, నగలు దొరికినట్లు, ఏనుగుపై స్వారీ చేసినట్లు, పండ్లు తిన్నట్లు, శరీరంపై పేడ పూసినట్లు కలలు వస్తే ధనలాభం కలుగుతుందట. కలలో రక్తం కనపడినా, స్తనపానం చేసినట్లు కల వచ్చినా, నూనె తాగినట్లు కల వచ్చినా, స్వీట్లు తిన్నట్లు, వివాహం అయినట్లు కలలు వచ్చినా, కలలో పోలీసులను చూసినా, గుండు చేయింంచుకున్నట్లు కల వచ్చినా వారు మరణ వార్త వింటారట.
విధవకు గడ్డం పెరిగినట్లు కలవస్తే వారికి మళ్లీ వివాహం జరుగుతుందట. అలాగే పెళ్లయిన వారికి తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడినట్లు కలలో కనిపిస్తే వారు విడాకులు తీసుకుంటారట. లేదా వారి బంధం తెగిపోతుందట. ఇలా మనకు వచ్చే కలలను బట్టి వాటి ఫలితాలను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.