సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు భక్తులు ఈ ఆలయం వెనుక భాగాన నమస్కరిస్తూ వెళ్తుంటారు. ఈ విధంగా ఈ ఆలయం వెనుక భాగంలో నమస్కరించడానికి గల కారణం చాలా మందికి తెలియక పోవచ్చు. ఆలయం వెనుక భాగంలో నమస్కరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఆలయంలో గర్భగుడిలో మూలవిరాట్టు ప్రతిష్టించడం వల్ల గర్భగుడి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తాము. ఈ క్రమంలోనే గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్టింప చేస్తారు.ఈ విధంగా మూలవిరాట్ ను ప్రతిష్టించిన తరువాత ఆలయంలో స్వామి వారికి చేసే అభిషేకాలు, అర్చనలు, పూజలు చేయటం వల్ల ఆ మంత్ర శక్తి మొత్తం మూలవిరాట్ కింద ఉన్నటువంటి యంత్రంలోకి శక్తి ప్రసరిస్తుంది. ఈ మంత్ర శక్తి గర్భగుడిలోని నాలుగువైపులకు ప్రసాదిస్తుంది.
ఈ మంత్ర శక్తి మూల విరాట్ కు దగ్గరగా ఉండే వెనుక గోడ వైపు అధికంగా ప్రచురించడం వల్ల దేవుడి మహిమలు, తపో కిరణాలు ఎక్కువగా వెనుక గోడ వైపు ప్రసరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకోసమే గర్భాలయానికి వెనుకవైపు ఉన్న గోడను నమస్కరించడం వల్ల ఆ శక్తులు మనకు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆలయానికి వెళ్ళిన భక్తులు గర్భ గుడి వెనుక వైపున నమస్కరిస్తున్నారు.