ప్రతిరోజూ రొటీన్ ఆహారం తిని విసుగెత్తారా? కొత్తరకం ఆహారం…ఎంతో రుచికరం, ఎక్కడపడిదే అక్కడ దొరికేది, చూపులకు ఎంతో ఆకర్షించేది, అన్నిటిని మించి కర కర మంటూ తినటానికి తేలికగా వుండేది అయిన కేరట్ తింటే, బరువు సహజంగా తగ్గటమేకాదు, మీ కంటి చూపు సైతం బాగుంటుంది. దీనిని సూప్, సలాడ్, జ్యూస్ గా లేదా అది ఎలా వుంటే అలా కూడా తినేయవచ్చు. విటమిన్లు అధికం. కంటికి మంచిది. పచ్చిగా వున్నా కరకరమంటూ ఆనందాన్నిస్తుంది. మిరియాల తర్వాత బేటా కెరోటిన్ అధికంగా వుండే ఆహారం కేరట్ మాత్రమే.
కుందేళ్ళకు ఇది ప్రధాన ఆహారం. వీటిని తినే కుందేళ్ళు ఎంతో తెలివిగాను, చురుకుగాను వుంటాయి. కార్బోహైడ్రుట్లు దీనిలో 10 శాతం మాత్రమే. విటమిన్లు ఎ,డి,ఇ,కె,పిపి, ఆస్కార్బిక్ యాసిడ్, మరెన్నో లవణాలు వుంటాయి. లివర్ కు చాలా మంచి ఆహారం. కేరట్ తింటే, గుండె సంబంధిత వ్యాధులు, కంటికి వచ్చే కేటారాక్ట్, కేన్సర్, వంటివి కూడా రాకుండా కాపాడుతుంది. బ్రెయిన్ కి అవసరమైన అయోడిన్ ఇస్తుంది. కొవ్వు తగ్గించే పీచు దీనిలో అధికం. మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్ లలో కనుక కేరట్ తప్పకుండా తీసుకుంటే, అతి త్వరగా 3 లేదా 4 కిలోల బరువు తగ్గే అవకాశాలుంటాయి.
మరి కేరట్ ఎలా తినాలి? కేరట్ జ్యూస్, మిల్క్ షేక్ లుగా తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో పచ్చికూరల సలాడ్ లో కేరట్ ప్రధానంగా వేసుకోవచ్చు. లంచ్ లో బ్రెడ్ టోస్ట్ లో కేరట్ ముక్కలు పెట్టుకోవచ్చు. ఇక రాత్రి డిన్నర్ లో బ్రౌన్ రైస్, పెరుగు కలిపిన మిశ్రమంలో కేరట్ ముక్కలు వుంటే కడుపు నిండిపోతుంది. ఈ ఆహారంతో పాటు కొద్దిపాటి వ్యాయామం, లేదా వేగవంతమైన నడక వంటివి ప్రతిరోజూ చేస్తే బరువుతగ్గటంలో మంచి ఫలితాలుంటాయి.