Banana : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటిపండు ఒకటి. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. అరటి పండు మనకు అన్నీ కాలాల్లో తక్కువ ధరలో విరివిరిగా లభిస్తూ ఉంటుంది. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ అరటి కాయను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం విరివిరిగా తినే ఈ అరటి పండు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండును తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పూర్వకాలంలో ఈ అరటి చెట్టు ఆకుల్లో భోజనం చేసే వారు. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అరిటాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిపై భోజనం చేయడం వల్ల ఎటువంటి క్రిములు మన ఆహారం ద్వారా లోపలికి చేరకుండా ఉంటాయి. అలాగే గుమ్మాలకు కూడా అరిటాకులు కడుతూ ఉంటారు.
ఇలా కట్టడం వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది. అరిటాకులను గుమ్మానికి కట్టడం వల్ల గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే అందరూ పండిన అరటికాయను మాత్రమే తింటారు. దీనిని తినడం వల్ల మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని భావిస్తారు. కానీ పచ్చి అరటికాయను తినడం వల్ల కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చి అరటికాయలో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు పండిన అరటి పండులో కంటే ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

దీని వల్ల మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము. రోజుకొక పచ్చి అరటికాయను ఉడికించి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ అరటికాయను ఉడికించి ఏ రూపంలో తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. పచ్చి అరటికాయ మన శరీర బరువును తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున ఒక పచ్చి అరటి కాయను ఉడికించి తీసుకోవడం వల్ల మనం చాలా త్వరగా, సులభంగా బరువు తగ్గవచ్చు. పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్దకం సమస్య నుండి బయటపడేలా చేయడంలో సహాయపడుతుంది.
అలాగే దీనిలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో దోహదపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పచ్చి అరటికాయ మనకు సహాయపడుతుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పచ్చిఅరటికాయను తీసుకోవచ్చు. పచ్చిఅరటికాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరగకుండా ఉంటాయి. పచ్చి అరటికాయలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశింపబడతాయి. దీంతో మనం క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ పచ్చి అరటికాయలతో కూరలను చేసి తీసుకున్నా లేదా ఉడికించి నేరుగా తీసుకున్నా కూడా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.