Apple : రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అది అక్షరాలా వాస్తవమే అని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్ పండ్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కనుక రోజుకో యాపిల్‌ను తినాలి. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే చాలా మంది యాపిల్ పండ్లపై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. ఇలా ఎంతమాత్రం చేయరాదని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా యాపిల్ పండ్లను పొట్టుతో సహా తినాల్సిందేనని సూచిస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండు గుజ్జులో కన్నా దానిపై ఉండే పొట్టులోనే పోషకాలు అధికంగా ఉంటాయి. గుజ్జు కన్నా 4 నుంచి 6 రెట్ల ఎక్కువ పోషకాలు పొట్టులోనే ఉంటాయి. కనుక పొట్టును తీసేస్తే ఆ పోషకాలను కోల్పోయినట్లే. కాబట్టి యాపిల్ పండ్లను పొట్టుతో సహా తినాల్సిందే. ఇక యాపిల్ పండు పొట్టు 0.3 ఎంఎం నుంచి 0.5ఎంఎం మందంతో ఉంటుంది. ఇది ఫైబర్‌ను అధికంగా కలిగి ఉంటుంది. లోపలి గుజ్జు కన్నా పైన ఉండే పొట్టులోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక యాపిల్ పండ్లను పొట్టుతో సహా తినాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.

యాపిల్ పండ్లకు చెందిన పొట్టులో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. కనుక మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. యాపిల్ పండు గుజ్జులో కన్నా పొట్టులోనే అధిక మొత్తంలో పొటాషియం, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక యాపిల్ పండ్లకు ఉండే పొట్టును తీయకుండానే నేరుగా అలాగే తినాలి.
ఒక మీడియం సైజ్ యాపిల్ పండులో విటమిన్ సి 8.5 మిల్లీగ్రాముల మేర ఉంటుంది. 100ఐయూ మేర విటమిన్ ఎ ఉంటుంది. అయితే పొట్టు తీస్తే వీటి శాతం తగ్గుతుంది. విటమిన్ సి 6.5 మిల్లీగ్రాములు, విటమిన్ ఎ 60 ఐయూ మాత్రమే ఉంటుంది. అంటే విటమిన్ల శాతం తగ్గుతుందన్నమాట. కనుక యాపిల్ పండ్లకు ఉండే పొట్టును తీయకుండానే తినాలి. ఇలా రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. యాపిల్ పండ్లను తినని వారి కన్నా తినే వారిలోనే రోగాలను ఎదుర్కొనే శక్తి బాగా ఉంటుందని తేల్చారు. కనుక రోజుకు ఒక యాపిల్ పండును తింటే రోగాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని చెప్పవచ్చు.