వేరుశెనగలను చాలా మంది రోజూ తింటూనే ఉంటారు. వాటితో చట్నీలు, పచ్చళ్లు చేసుకుని తింటారు. కొందరు కూరల్లోనూ వాటిని వేస్తుంటారు. అయితే వేరుశెనగలను నేరుగా కన్నా నీటిలో నానబెట్టి తింటే ఎంతో మేలు. వాటిని ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినవచ్చు. లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం స్నాక్స్ లా తీసుకోవచ్చు. రోజుకు ఒక కప్పు మోతాదులో వేరుశెనగలను నానబెట్టి తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
1. వేరుశెనగల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, సోడియం, విటబిన్లు బి1, బి2, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల అనేక పోషకాలు మనకు రోజూ లభిస్తాయి. దీని వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
2. వేరుశెనగలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది.
3. వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న వారు రోజూ వేరుశెనగలను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ సమస్య తగ్గుతుంది.
4. వేరుశెనగల్లో బీటా సిటోస్టెరాల్ ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు పెరగకుండా చూస్తుంది. రోజూ వేరుశెనగలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను 58 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.
5. వేరుశెనగలను తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వేరుశెనగలు పూర్తిగా వృక్ష సంబంధ పదార్థం. అందువల్ల వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధికంగా ఆహారం తినకుండా చూస్తాయి. దీంతో అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
6. వేరుశెనగలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.