Fenugreek Flax Kalonji Seeds : ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. రక్తపోటు, షుగర్, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మూడు రకాల పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల చాలా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మన అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే ఆ మూడు పదార్థాలు ఏమిటి… వీటిని ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకోవాల్సిన పదార్థాల్లో కాళోంజి విత్తనాలు ఒకటి. ఇవి మనకు ఎక్కడపడితే అక్కడ విరివిరిగా లభిస్తాయి.
ఈ విత్తనాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఈ కాళోంజి విత్తనాలను విరివిరిగా ఉపయోగిస్తారు. గుండె సమస్యలను నివారించడంలో, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, మోకాళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో ఈ విత్తనాలు ఎంతో సహాయపడతాయి. అలాగే మనం ఉపయోగించాల్సిన రెండో పదార్థం అవిసె గింజలు. అవిసె గింజలు మనందరికి తెలిసినవే. అవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది.
అధిక బరువుతో బాధపడే వారు అవిసె గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇక మనం ఉపయోగించాల్సి చివరి పదార్థం మెంతులు. మెంతులు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేవే. వంటల్లో వీటిని మనం విరివిరిగా వాడుతూ ఉంటాం. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంతో వాత దోషాలను, కఫ దోషాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో, రక్తనాళాలల్లో పేరుకుపోయిన అడ్డంకులను తొలగించడంలో, జీర్ణ సమస్యలను నయం చేయడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో మెంతులు మనకు ఎంతో సహాయపడతాయి.
ఇప్పుడు ఈ మూడు పదార్థాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ లో అర టీ స్పూన్ అవిసె గింజలు, అర టీ స్పూన్ కాళోంజి విత్తనాలు, అర టీ స్పూన్ మెంతులు వేసి కలపాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి రాత్రంతా వీటిని నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా చేసుకుని పరగడుపున తాగాలి. అలాగే ఈ పదార్థాలను పేస్ట్ గా చేసి పెరుగుతో లేదా మజ్జిగతో కలిపి తీసుకోవాలి. వేడి శరీరతత్వం ఉన్న వారు మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తీసుకోవడం ఇష్టంలేని వారు ఈ పదార్థాలను ఒక టీ స్పూన్ తేనెతో కలిపి మెత్తగా నమిలి మింగాలి. అలాగే వీటిని పేస్ట్ గా చేసి చపాతీ పిండిలో కలిపి చపాతీలుగా కడా తినవచ్చు. ఈ విధంగా ఈ మూడు పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేసుకోవచ్చు.