వాల్‌నట్స్.. వీటినే అక్రోట్స్ అని కూడా అంటారు. వీటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా-లినోలీయిక్ యాసిడ్, ఫైబర్ (పీచు పదార్థం), ప్రోటీన్లు, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, బయోటిన్, మాంగనీస్, మాలిబ్డినం, విటమిన్ ఇ, బి6లు కూడా పుష్కలంగానే ఉంటాయి. వాల్ నట్స్ ను నిత్యం గుప్పెడు మోతాదులో తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. వాల్‌నట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు కణాలు రక్షించబడతాయి.
2. వాల్‌నట్స్ లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. అందువల్ల గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. వాల్ నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ డిప్రెస్సెంట్స్‌గా పనిచేస్తాయి. అంటే డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
4. నిత్యం గుప్పెడు వాల్‌నట్స్‌ను కనీసం 2-3 నెలల పాటు తింటే జీర్ణాశయానికి ఎంతో మేలు జరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. అజీర్ణ సమస్య తగ్గుతుంది.
5. వాల్ నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, విటమిన్ బి6, కాపర్, మాంగనీస్, సెలీనియంలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
6. వాల్ నట్స్ ను తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఎముకల ఆరోగ్యం మెరుగు పడుతుంది. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.